Saturday, 16 May 2026

దివ్య సాలగ్రామ క్షేత్రం

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం వ్రాసిన మహర్షి .. శ్రీమాన్‌ ప్రతివాది భయంకరం అణ్ణన్‌ స్వామి. నేను ఆ మహనీయునికి పదిహేనవ తరం మనవడిని.

అణ్ణన్‌ స్వామి సేవించుకున్న ద్వాదశ సాలగ్రామాలు భూ నీళా సమేత లక్ష్మీనారాయణ అర్చామూర్తులు వారి వంశస్థుల సేవలో అరారుతూ .. గత ఆరున్నొక్క వందల ఏళ్ల నుంచి పలువురను తరింపజేశాయి. ఆ పరంపరలో భాగంగా ధన్యులైన పెద్దల మార్గంలో జీవనం సాగించే అదృష్టం నాకు కలిగింది.

అణ్ణన్‌ స్వామి సేవించుకున్న సాలగ్రామాలు అర్చామూర్తులు కొలువుదీరిన క్షేత్రమే దివ్య సాలగ్రామ క్షేత్రం. బ్రహ్మవిద్యకు ఆంబన అయిన సాలగ్రామ సేవకు జీవనాన్ని అంకితం చేసుకుని, ఋషిమార్గంలో తపశ్చర్యకు గురువును ఆశ్రయించి నా శేషకాలాన్ని ఈ ప్రాంగణంలోనే వినియోగం చేస్తుండడం నా దినచర్య. 

ఈ క్షేత్రంలో నిత్యం ఋషిప్రోక్తమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భగవత్ప్రేరితమైన యజ్ఞయాగాలతో పాటు వ్యక్తి, కుటుంబం, సమాజం శ్రేయస్సుకు ఉపయుక్తమైన క్రతువుల నిర్వహణ కూడా జరుగుతూ ఉంటుంది.

ధర్మానుష్టానం

భగవంతుని అనుగ్రహం, దేవతల ఆశీస్సులు మీకు అందాలనే సంకల్పంతో నిర్వహించేది ధర్మానుష్టానం. స్వయంభువుగా ఏర్పడిన వినాయక సాలగ్రామానికి, తర్వాత సహజ విభూతి రేఖలతో ఏర్పడిన శివనాభము అనే ఈ సాలగ్రామ లింగానికి అభిషేకం జరుగుతుంది. అనంతరం భూదేవి, నీళాదేవి సహిత లక్ష్మీనారాయణులతో కొలువుదీరిన ఈ పన్నెండు విష్ణు సాలగ్రామాలకు అభిషేకం అర్చన జరుగుతుంది. ద్వాదశ అంటే పన్నెండు సాలగ్రామాలు ఎక్కడ ఉంటే అక్కడ 108 తిరుపతుల క్షేత్ర మహాత్మ్యం ఉంటుందని శాస్త్రం. ఈ సాలగ్రామ సేవ అనంతరం హోమం జరుగుతుంది.

యుగధర్మ ట్రస్ట్

ఋషి జీవన విధాన ప్రచార బాధ్యతతో యుగధర్మ ట్రస్టు గత పదేళ్లుగా భారతదేశమంతటా వందలాది యజ్ఞాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ గురు పౌర్ణమిని 09-07-2017 పురస్కరించుకుని ఊరూరా గో యజ్ఞం నిర్వహించాలని, ఊరంతా గాయత్రీ మంత్రం వినిపించాలని, ఇంటింటా సాలగ్రామ అనుష్టానం జరపాలనే ఆశయంతో భారత యాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ ఆశయం క్రియాత్మకంగా వ్యాప్తి చెందాలనే దృఢ నిశ్చయంతో దైవ చింతన గల ఎన్నారైలు, ధర్మ చింతన గల విద్యావేత్తలు, అథ్యాత్మిక చింతన గల సైంటిస్టులు అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు. సనాతన ధర్మ సంపన్నమైన మన దేశాన్ని, మానవాళిని అథ్యాత్మిక శక్తితో నడిపించడానికి మీరు కూడా అండగా నిలవాలి.

Thursday, 30 April 2026

గోవుకు ఆహారం

In the animal kingdom the cow is the only animal bestowed with subtle body. She can do wonders beyond imagination that benefit mankind. A healthy cow means the gross body of a cow is well protected. When her subtle body is rightly awakened she becomes a holy cow, "kamadhenu". Puranas tell us about kings gifting away 'healthy cows' to spiritual masters, who in turn processed them into 'holy cows'.

Fire ritual viz.YAJNAM makes a healthy cow as a holy cow. Cow has a built in software that can store, process and release solarenergy. The key to  activate that software is gayatrimantra. The solar energy released by a cow has a distinct quality. Cow actually process sun rays before releasing them through her breath, urine, dung etc, and more significantly her "voice".

శివాభిషేకం

1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. 
2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 
3 .ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును 
4 .పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. 
5 .ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును 
6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును. 
7 .మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును 
8 .మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును. 
9 .తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10.పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11.కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 .రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 .భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 .గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 .బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 .నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును
17 .అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. 
శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన). 
18.ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు. 
19 .ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది. 
20 .నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును. 
21.కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును. 
22 .నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 .మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును. 
24 .పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు. 

Wednesday, 29 April 2026

సంప్రదాయమే చేతనకు తల్లి

ఆళ్వార్లు. వీరు శ్రీవైష్ణవ సంప్రదాయంలో ముఖ్యులు. నిత్య అనుష్టాన బలం, మంత్రం, జప సిద్ధి కలిసి ఉన్నదానిని సంప్రదాయం అంటారు. సంప్రదాయం అంటే 'సకల ప్రాణుల శ్రేయోకాంక్ష' ఉన్నవారు మాత్రమే పాటించగలిగేది. (ఇతరమైన నిర్వచనాలు కేవలం తార్కికమైనవి). 

అటువంటి సంప్రదాయ పరులైన ఆళ్వార్లలో ఒకరు ఒక రాత్రి సమయములో ఒక అరుగు మీద నిద్రిస్తున్నారు. వాన వస్తున్న కారణంగా మరొక ఆళ్వారు ఆ అరుగు మీదకు రాగా. నిద్రిస్తున్న ఆయన లేచి చోటు ఇచ్చారు. అలా వారిద్దరూ 'కూర్చొని' ఉండగా మూడో ఆళ్వారు వచ్చారు. అ చోటులోనే ముగ్గురూ ఇరుక్కొని నిలబడ్డారు.  కాసేపటికే.. ఎవరో నాలుగో వ్యక్తి ఉన్నట్టుగా.. వారికి 'ఇరుకు' అనిపించింది. వెంటనే ఆ ముగ్గురికి ఒకేసారి తమ మధ్య భగవంతుడు ఉన్నట్టు అనుభూతి కలిగింది.

తార్కికంగా ఆలోచిస్తే అక్కడ ఉన్నది ఇరుకే అయినా 'అది' భగవంతుడు అని అనిపించేటంతగా వారి చేతన వికసించి ఉన్నది. వారికి ఈ వికాసం సామాజిక ఉద్యమాల వల్ల వచ్చినది కాదు. కేవలం 'సాంప్రదాయ' బలం వల్ల మాత్రమే ఒనగూడిన సమర్ధత. 

విడి పూవులను దండగా చేసే దారం ఎలాంటిదో, వ్యక్తులను కుటుంబాలుగా.. తద్వారా సమాజంగా... చేసే సంప్రదాయం అలాంటిది.  స్వేఛ్చ పేరుతో విశృంఖలత్వాన్ని కోరుతున్న వారే సంప్రదాయానికి చిచ్చు పెడుతున్నారు. 

అనాది కాలం నుంచి ఇళ్లు ఉన్న చోట ఎలుకలు ఉండేవి. కానీ మనకిలాగా ఎలుకల పేరు చెప్పి ఇళ్లు తగలబెట్టుకుంటున్న వారు ఏ కాలంలోనూ లేరు.  మరొకరి ద్వారా తప్పు తెలుసుకోవడం, దాన్ని దిద్దుకోవడం ఆత్మద్రోహం కాదు.  ఆళ్వార్లను  ఆదర్శంగా తీసుకుని మన ఇబ్బందిని, అసౌకర్యాన్ని భగవంతుడిగా భావించి మరొకరికి మేలు చేద్దాం.

భగవత్సేవే అనుష్టానం

విశ్వశక్తిని జీవశక్తితో సంధానం చేసుకునే విధానమే ఆధ్యాత్మికంలో అత్యంత కీలకమైనది. ఈ సంధాన ప్రక్రియకు బుద్ధిబలం అత్యంత ఆవశ్యకం. బుద్ధికి బద్ధ శత్రువు మనస్సు. అటువంటి మనస్సును మిత్రుడిగా చేసుకోవడానికి ఋషులు రూపొందించిన పద్ధతి ఈ అనుష్టానం. ఇది శబ్ద, రూప ప్రధానమైనది. సగుణ, నిర్గుణ లక్షణాల ఆధారంగా, అనంత స్థితిని మనస్సు అనుభవం చేసుకోవాలంటే జీవుడు నిత్యానుష్టానం చేయక తప్పదు. 

ఒక్కమాటలో చెప్పాలంటే .. మనస్సును బుద్ధి దిశగా మళ్లించే లక్ష్యంతోనే అనుష్టాన ప్రక్రియ రూపుదిద్దుకుంది. అందుకే బుద్ధికి బలాన్ని పెంచే శబ్దజాలంతో, సగుణ, నిర్గుణ లక్షణాలకు మనస్సు చేసుకోవాల్సిన సేవలే ఈ అనుష్టానంలో ముఖ్య ఘట్టాలు. మనస్సు ఎటువంటి సేవలు చేసుకుంటే బుద్ధి వైపు, తద్వారా భగవంతుని వైపు ఇష్టపూర్వకంగా నడిచి వెళ్తుందో తెలుసుకుని, అటువంటి సేవలను జీవుడు నిత్యం అనుష్టించాలి.  

స్వాగతం

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం వ్రాసిన మహర్షి .. 

శ్రీమాన్‌ ప్రతివాది భయంకరం అణ్ణన్‌ స్వామి.

ఆ స్వామి సేవించుకున్న ద్వాదశ సాలగ్రామాలు - భూ నీళా సమేత లక్ష్మీనారాయణ అర్చామూర్తులు వారి వంశస్థుల సేవలో అలరారుతూ .. గత ఆరున్నొక్క వందల ఏళ్ల నుంచి పలువురను తరింపజేశాయి. అణ్ణన్‌ స్వామి సేవించుకున్న సాలగ్రామాలు - అర్చామూర్తులు కొలువుదీరిన క్షేత్రమే “దివ్య సాలగ్రామ క్షేత్రం”.

మనిషిని ఋషిని చేయగల విశేషత, విశిష్టత ఉన్న సాలగ్రామాన్ని ప్రతి ఒక్కరూ తమ తమ సమర్ధత మేరకు ప్రత్యక్ష పరోక్ష స్థితుల్లో ఆరాధించుకోవడానికి, సేవించుకోవడానికి, తద్వారా జీవితమంతా ఆనందమయం చేసుకోవడానికి పరిపూర్ణమైన అవకాశాన్ని అందించేదే ‘‘దివ్య సాలగ్రామ క్షేత్రం’’.

 నిత్యం ఋషి ప్రోక్తమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భగవత్ప్రేరితమైన యజ్ఞయాగాలతో పాటు వ్యక్తి, కుటుంబం, సమాజం శ్రేయస్సుకు ఉపయుక్తమైన క్రతువుల నిర్వహణకు ఆలయంగా భాసిల్లుతున్న ప్రాంగణం ఈ ‘‘దివ్య సాలగ్రామ క్షేత్రం’’

శ్రీకృష్ణార్పణమస్తు !!!

సాలగ్రామం విష్ణురూపం

1.విశ్వశక్తి అత్యధిక శాతంలో ఉన్న

ఏకైక పదార్ధం ‘సాలగ్రామం’ 

2. సర్వపాప నివారకం, అకాల

మృత్యు హరణం ‘సాలగ్రామ తీర్థం’

3. ద్వాదశ సాలగ్రామముల సన్నిధి 108 తిరుపతుల క్షేత్ర మహాత్మ్యమునకు సమానమైనది.

4. ‘సాలగ్రామం`ద్వారకాశిల’ ఉన్న చోటు ..

సాక్షాత్తూ శ్రీ వైకుంఠ వైభవమునకు సమానం.

5. యోగసాధనకు, ఋషి జీవనానికి

ఆయువుపట్టు సాలగ్రామమే.

6. బ్రహ్మవిద్యకు ఆలంబనగా నిలిచేది

ఒక్క సాలగ్రామ సేవ మాత్రమే.