Wednesday, 29 April 2026

భగవత్సేవే అనుష్టానం

విశ్వశక్తిని జీవశక్తితో సంధానం చేసుకునే విధానమే ఆధ్యాత్మికంలో అత్యంత కీలకమైనది. ఈ సంధాన ప్రక్రియకు బుద్ధిబలం అత్యంత ఆవశ్యకం. బుద్ధికి బద్ధ శత్రువు మనస్సు. అటువంటి మనస్సును మిత్రుడిగా చేసుకోవడానికి ఋషులు రూపొందించిన పద్ధతి ఈ అనుష్టానం. ఇది శబ్ద, రూప ప్రధానమైనది. సగుణ, నిర్గుణ లక్షణాల ఆధారంగా, అనంత స్థితిని మనస్సు అనుభవం చేసుకోవాలంటే జీవుడు నిత్యానుష్టానం చేయక తప్పదు. 

ఒక్కమాటలో చెప్పాలంటే .. మనస్సును బుద్ధి దిశగా మళ్లించే లక్ష్యంతోనే అనుష్టాన ప్రక్రియ రూపుదిద్దుకుంది. అందుకే బుద్ధికి బలాన్ని పెంచే శబ్దజాలంతో, సగుణ, నిర్గుణ లక్షణాలకు మనస్సు చేసుకోవాల్సిన సేవలే ఈ అనుష్టానంలో ముఖ్య ఘట్టాలు. మనస్సు ఎటువంటి సేవలు చేసుకుంటే బుద్ధి వైపు, తద్వారా భగవంతుని వైపు ఇష్టపూర్వకంగా నడిచి వెళ్తుందో తెలుసుకుని, అటువంటి సేవలను జీవుడు నిత్యం అనుష్టించాలి.  

No comments:

Post a Comment